మద్యం షాపు వద్దే.. వద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపు వద్దే.. వద్దు

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

అల్లూరు: మండలంలోని తూర్పుగోగులపల్లి దళితవాడలో మద్యం దుకాణ ఏర్పాటును మహిళలు గురువారం అడ్డుకున్నారు. లైసెన్స్‌ను దక్కించుకున్న వ్యక్తి.. షాపును తెరవగా, వీరు నిరసన చేపట్టారు. ఇక్కడ ప్రార్థన మందిరాలతో పాటు పాఠశాల ఉందని, ఈ తరుణంలో ఏర్పాటుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.

బోగోలు(కావలి): బోగోలు పంచాయతీ చెంచులక్ష్మీపురం ఎంపీపీ మోడల్‌ పాఠశాల, లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వైన్‌ షాపు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనను మహిళలు చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేయాలనే యత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement