25న పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

25న పాలిసెట్‌

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

రాపూరు, పొదలకూరు

ప్రాంతాల్లో కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు(టౌన్‌): పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్‌ ఈ నెల 25వ తేదీన జరుగుతుందని నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామారావు తెలిపారు. మంగళవారం ఆయన కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలిటెక్నిక్‌ చదివితే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, డీసీసీపీ తదితర సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సౌలభ్యం కోసం రాపూరు, పొదలకూరు ప్రాంతాల్లో కూడా పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వివరాలకు 99123 42016 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement