నెల్లూరు(పొగతోట): పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా పవిత్ర మాసం సహనం, సేవాభావాన్ని పెంపొందిస్తుందన్నారు. పండగను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు.
● నెల్లూరు(క్రైమ్): రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సేవాభావం, సామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ పండగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.
చికెన్ వ్యర్థాల
వాహనం స్వాధీనం
పొదలకూరు: బెంగళూరు నుంచి రాపూరు, పొదలకూరు మీదుగా సంగంలో చేపల గుంతల వద్దకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న మినీలారీని పొదలకూరు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. రాపూరు నుంచి మినీలారీ వస్తుందనే సమాచారం తెలియడంతో మత్స్య, రెవెన్యూ శాఖల సహకారంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనంలో 66 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వ్యర్థాలున్నట్టు గుర్తించారు. వాటిని డంపింగ్ యార్డు వద్ద గుంత తీసి పాతిపెట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఆదిలక్ష్మీదేవికి వజ్రాల
మంగళసూత్రం బహూకరణ
రాపూరు: పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్‌కు చెందిన వసంతపు శ్రీనివాస్, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండి కాలిపట్టీలు, వెండి మెట్లు అందించినట్లు వెల్లడించారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు వెల్లడించారు.


