24న కలిగిరిలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

24న కలిగిరిలో జాబ్‌మేళా

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎంప్లాయీమెంట్‌ ఆఫీస్‌, సీడాప్‌ సంయుక్తంగా ఈనెల 24వ తేదీన కలిగిరి ఏపీ మోడల్‌ స్కూల్లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్‌ చదివిన నిరుద్యోగులు హాజరుకావొచ్చన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 99888 53335, 87126 55686 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కావలి(జలదంకి): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జలదంకి మండలం 9వ మైలులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. 9వ మైలు ఎస్సీకాలనీకి చెందిన రామయ్య (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

పొదలకూరు

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి: రూ. 90

సన్నవి: రూ. 70

పండ్లు: రూ. 45

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement