● పీడీ హేనాసుజన్
మనుబోలు: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన చేస్తారని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్ అన్నారు. మనుబోలు మండల కేంద్రలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించారు. చిన్నారులకు అందజేసే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆటపాటల ద్వారా విద్యాబోధన చేస్తారని తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు ఆదినారాయణమ్మ, పద్మజ తదితరులున్నారు.


