
మహాసమాధి మహోత్సవాలు ఆరంభం
నెల్లూరు(బృందావనం): పద్మావతి నగర్‌లోని శ్రీసాయిదర్బార్ అద్దాల మందిరంలో 107వ మహాసమాధి (ఆరాధన) మహోత్సవాలను బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. భిక్షాటన కార్యక్రమాన్ని ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. షిర్డీ సంప్రదాయం ప్రకారం సాయినాథుడి స్వరూపులుగా భక్తులు పద్మావతి నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్, సరస్వతీనగర్ తదితర పురవీధుల్లో భిక్షాటన చేశారు. తొలుత మందిరంలో షిర్డీవాసుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయిభక్తులకు పాదపూజ నిర్వహించారు. ఉభయకర్తలుగా గునుపూడి వేణుగోపాల్, రాజ్యలక్ష్మి, కోటంరెడ్డి అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీలత వ్యవహరించారు. కార్యక్రమాలను మధుసాయి, గౌరవ సలహాదారులు పాబోలు రామసుబ్బయ్య తదితరులు పర్యవేక్షించారు. విజయదశమి సందర్భంగా గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.