
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు
రాపూరు: వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు మేలు చేకూరిందని నెల్లూరు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి షరీనా తెలిపారు. మండలంలోని ఆదురుపల్లిలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం యంత్రాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించిందన్నారు. ట్రాక్టర్ స్పేర్ పార్టులపై 18 నుంచి 5 శాతానికి తగ్గించిందని తెలిపారు. రైతులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వ్యవసాయం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఏఓ సోమసుందర్, ఈఓపీఆర్‌డీ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.