
సచివాలయ ఉద్యోగుల నిరసన
అనుమసముద్రంపేట: సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సచివాలయ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్‌పేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేత ఖాదర్‌వలీ మాట్లాడారు. వలంటీర్ విధులైన ఇంటింటి సర్వే నుంచి విముక్తి కల్పించాలని.. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని.. ఉద్యోగులను వారి మాతృశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నేతలు రఘు, శేఖర్, షరీఫ్, దేవా, శివ, అస్గర్, ఏడుకొండలు, మస్తాన్, యస్దానీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ భూములను పరిరక్షిస్తాం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి సంబంధించిన భూములను పరిరక్షిస్తామని ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కామాక్షితాయి ఆలయానికి చెందిన భూమి ఆక్రమణపై ‘టీడీపీ నేత బరితెగింపు’ అనే శీర్షికన సాక్షిలో గత నెల 27న కథనం ప్రచురితమైన నేపథ్యంలో కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న 40 సెంట్ల ఆలయ భూమి ఆక్రమణకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపడతామని వివరించారు. రికార్డుల్లో సదరు భూమి ఆలయానికి చెందినట్లు ఉందని, సంబంధిత ఆధారాలను ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్ అధికారులకు ఇచ్చామని పేర్కొన్నారు. కాగా నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నామని చైర్మన్‌గా నియమితులైన తిరుమూరు అశోక్‌రెడ్డి తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన

సచివాలయ ఉద్యోగుల నిరసన