
కాలం తీరిన కూల్‌డ్రింక్‌పై ప్రశ్నించినందుకు..
● మహిళపై దాడి
మనుబోలు: ఓ దుకాణ యజమాని తనపై దాడి చేసి గాయపరిచాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పారిచర్ల కోటమ్మ గతనెల 27వ తేదీన తన మనుమడు ధనుష్‌ను దుకాణానికి వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకురావాలని చెప్పింది. అతను పడాల రాధయ్య దుకాణానికి వెళ్లి మాజా బాటిల్ తెచ్చాడు. దాన్ని తెరవగా వాసన వచ్చింది. పరిశీలించగా కాలం తీరిపోయినట్లు తెలిసింది. కోటమ్మ దుకాణానికి వెళ్లి డబ్బు తిరిగివ్వాలని కోరింది. ఆగ్రహించిన యజమాని రాధయ్య ఆమైపె కర్రతో దాడి చేశాడు. బాధితురాలు అదేరోజు మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారు ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతోపాటు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదు. దీంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట సీపీఎం నాయకుడు బీసీ భాస్కర్ ఉన్నారు.