
డైమండ్ డబ్బా నిర్వహణపై కేసు నమోదు
వెంకటాచలం: మండలంలోని అనికేపల్లిలో డైమండ్ డబ్బా నిర్వహణకు సంబంధించి వెంకటాచలం పోలీసులు గురువారం ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా అనికేపల్లి గ్రామదేవత ఆలయం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు డైమండ్ డబ్బా నిర్వహించారు. యువకులు నగదు పోగొట్టుకున్నారు. దీనిపై సాక్షిలో 2వ తేదీన కథనం ప్రచురితమైంది. జూదంపై ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. వెంకటాచలం పోలీసులు అనికేపల్లి గ్రామానికి చెందిన పుట్టా ప్రభాకర్, పర్వతాల శివప్రసాద్, యనమల ప్రభాకర్, నాసిన శ్రీనివాసులు, తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువు గ్రామానికి చెందిన నాగరాజాపై కేసు నమోదు చేశారు.
కలెక్టర్‌ను కలిసిన
ఆనం అరుణమ్మ
నెల్లూరు రూరల్: కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆయన కార్యాలయంలో శుక్రవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
● కడప కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు(క్రైమ్): పదేపదే నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ గోని రాముపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు వెంకటేశ్వరపురం అంబేడ్కర్ కాలనీకి చెందిన రాము నేరాలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లినా మారలేదు. ప్రస్తుతం ఉడ్‌హౌస్ సంఘంలో ఉంటున్నాడు. అతడిపై రెండు హత్య, ఆరు హత్యాయత్నం, రెండు దారిదోపిడీ, రెండు దొంగతనం, మూడు దాడి కేసులున్నాయి. నవాబుపేట పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ చేసినా మార్పురాలేదు. దీంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం రాము జిల్లా కేంద్రకారాగారంలో ఓ కేసులో రిమాండ్‌లో ఉండగా నవాబుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున కడప కేంద్ర కారాగారానికి తరలించారు. గతంలో రాము పెయింట్ పనులు చేసేవాడు.
● ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ అజిత శుక్రవారం హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసు అధికారులకు లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మినీ లారీ దగ్ధం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు కరెంటాఫీసులోని స్పెషల్ పవర్ మెయింటెనెన్స్ (ఎస్‌పీఎం) విభాగంలో శుక్రవారం సాయంత్రం మినీ లారీలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జి ఏడీఎఫ్‌ఓ పి.శ్రీనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు సిబ్బంది తెలిపారు.
పొదలకూరు నిమ్మ ధరలు(కిలోలలో)
పెద్దవిః రూ.35
సన్నవిః రూ.20
పండ్లుః రూ.10

డైమండ్ డబ్బా నిర్వహణపై కేసు నమోదు

డైమండ్ డబ్బా నిర్వహణపై కేసు నమోదు

డైమండ్ డబ్బా నిర్వహణపై కేసు నమోదు