నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): విజయదశమిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ఈ సందర్భంగా పండగ శుభాకాంక్షలను తెలియజేశారు.
శుభాకాంక్షలు
నెల్లూరు రూరల్: జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలను విడుదల చేశారు.
పింఛన్ల పంపిణీ
నెల్లూరు(పొగతోట) / నెల్లూరు (బారకాసు): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం పంపిణీ చేశారు. నగరంలోని మూలాపేటలో గల ఈఎస్సార్‌ఎం స్కూల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి మూడేళ్లుగా మంచానికే పరిమితమైన పక్షవాత రోగి సిరివెళ్ల శ్రీనివాస్‌కు రూ.15 వేలు, ఒంటరి మహిళ శారదకు రూ.నాలుగు వేలను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను ఆరాతీశారు. శ్రీనివాస్‌కు సంబంధించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించి.. అవసరమైతే ఎమ్మారై స్కాన్‌ను తీయించాలని సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 3,07,543 మందికి గానూ 2,88,308 మందికి తొలి రోజు పంపిణీ చేశారు. కమిషనర్ నందన్,, ఎడ్యుకేషన్ సెక్రటరీ రజని తదితరులు పాల్గొన్నారు.
డీసీపల్లిలో 798 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 798 బేళ్లను బుధవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. వేలానికి 1063 బేళ్లు రాగా, వీటిలో 798ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 1,00,613 కిలోల పొగాకును విక్రయించగా, రూ.2,16,28,247.70 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర రూ.330.. కనిష్ట ధర రూ.80.. సగటు ధర రూ.214.96గా నమోదైందని తెలిపారు. పది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలి
విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలి