
పత్రికలు ప్రజా గొంతుకలు
‘సాక్షి’పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
●
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన నాలుగు స్తంభాల్లో ఒకటైన మీడియాలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల గొంతుకలై వ్యవహరించే ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తూ వ్యవహరిస్తున్న తీరు, నోరు నొక్కడానికి పోలీస్ యంత్రాగాన్ని వినియోగిస్తున్న విధానం అప్రజాస్వామికం. ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధులుగా పత్రికలు పని చేస్తాయి. ప్రభుత్వంలో జరిగే తప్పొప్పలు పత్రికలు ఎత్తి చూపుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ‘సాక్షి’ మీడియాను పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులను ప్రొత్సహించడం, మీడియాను అణచివేయడానికి చూడడం హేయమైన చర్య.
– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉదయగిరి సమన్వయకర్త
ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే పత్రిక వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను వెలుగులోకి తెస్తున్నారన్న కోపంతో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డితోపాటు ఇతర విలేకరులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదు. పత్రికా వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పాలకులకు నచ్చని వార్తలొస్తే ఖండన ఇవ్వొచ్చు. అంతేకానీ ఇలా వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు.
– జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు

పత్రికలు ప్రజా గొంతుకలు

పత్రికలు ప్రజా గొంతుకలు