
యూపీహెచ్‌సీ ఉద్యోగులకు భద్రత కల్పించాలి
నెల్లూరు(అర్బన్): ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పించాలని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం, గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలోని 28 యూపీహెచ్‌సీ ఉద్యోగులతో నగరంలోని బాలాజీనగర్‌లో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే మెరుగైన జీతాలతో పాటు హెచ్‌ఆర్ పాలసీని అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా చిరుద్యోగుల జీతాల్లో కోత విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని చెప్పారు. వివిధ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను చేపడతామని స్పష్టం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, అజయ్‌కుమార్, 104 ఉద్యోగుల ప్రెసిడెంట్ వాసు, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గ ఎన్నిక
ఈ సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయితేజ, రూపేంద్ర, వర్కింగ్ ఉమెన్ ప్రెసిడెంట్‌గా స్రవంతి, కోశాధికారిగా శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెన్నకేశవ, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా పవన్, ఉపాధ్యక్షులుగా కవిత, స్రవంతి, జాయింట్ సెక్రటరీలుగా అఫ్రోజ్, ప్రసాద్, నాగరాజమ్మ తదితరులను ఎన్నుకున్నారు.