
ఎంతమాత్రం తగదు
పత్రిక స్వేచ్ఛపై దాడి
●
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడం మంచి పరిణామం కాదు. పత్రికలు రాసే వార్తపై న్యాయపరమైన పోరాటాలు చేయాలే గానీ ఎన్నడూ లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడం సమంజసం కాదు. సాక్షి ఎడిటర్‌పైనే పోలీస్ కేసులు నమోదు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇది ముమ్మాటికీ పత్రికలపై దాడిగానే భావించాలి.
– భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి, మనుబోలు
పత్రికలపై నేరుగా కేసులు పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వ విధానాలపై పత్రికలు ఎంతో కాలంగా విమర్శనాత్మక కథనాలు రాస్తూనే ఉన్నాయి. సాక్షి ఎడిటర్‌పై పోలీస్ కేసులు పెట్టించడంతో పత్రిక స్వేచ్ఛ ప్రమాదంలో పడినట్లయింది. ఇలాంటి ఘటనలను మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– బాబూమోహన్‌దాస్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి

ఎంతమాత్రం తగదు

ఎంతమాత్రం తగదు