
సిగ్గుతో ప్రభుత్వ పెద్దలు తలదించుకోవాలి
ఉలవపాడు: కరేడులో రైతులపై జరుగుతున్న అరాచకానికి ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ విమర్శించారు. కరేడులో ఆదివారం నిర్వహించిన భూసేకరణ వ్యతిరేక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులను కలిసేందుకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇక్కడ ఏర్పడిందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సింది పోయి ఆరాచక ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. లక్షలాది ఎకరాల భూములు తీసుకోవడం తప్ప అభివృద్ధి మాత్రం జరగడంలేదన్నారు. రైతులకు అండగా నిలబడితే కేసులు పెట్టి వేధించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు.
పిస్టల్‌తో కాల్చేయండి..
ఉప్పరపాళెం నుంచి కరేడు ఉద్యమ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఉప్పరపాళేనికి చెందిన ఓ రైతు మీ దగ్గర ఉన్న పిస్టల్‌తో కాల్చేయండి.. ఇలా ఎంత కాలం అడ్డుకుంటారంటూ సీఐ అన్వర్‌బాషాను ప్రశ్నించారు. రైతు ఉద్యమ నేత మిరియం శ్రీనివాసులు, సీపీఎం నేత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిగ్గుతో ప్రభుత్వ పెద్దలు తలదించుకోవాలి