
● వ్యక్తి మృతి
దగదర్తి: మండలంలోని లయన్స్ నగర్ జాతీయ రహదారి వంతెనపై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై జంపానికుమార్ కథనం మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి కాలినడకన వెళ్తుండగా వాహనం ఢీకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయ సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్ప త్రికి తరలించారు.