ప్రగతి పరుగులు

బుచ్చి మండలం రామచంద్రాపురం గిరిజన కాలనీలో సచివాలయ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు   - Sakshi

అన్నివర్గాల సంక్షేమంతో పాటు వారికి కావల్సిన మౌలిక వసతుల కల్పనకు

రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ

ప్రాంతాల్లో రోడ్లు, కాలువల నిర్మాణాలను చేపడుతున్నారు. వీటితోపాటు స్థానిక ఎమ్మెల్యేలు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి సచివాలయానికి, నియోజకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. వీటితో గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి.

బుచ్చిరెడ్డిపాళెం : గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. సచివాలయ స్థాయిలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్‌ గ్రామస్థాయిలోనే అభివృద్ధి కోసం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులను కేటాయించారు.

769 గ్రామ సచివాలయాలకు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 549 గ్రామ సచివాలయాలు, 220 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 769 సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున దాదాపు రూ.153.8 కోట్లను గత నెలలో మంజూరు చేశారు. ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు కావడంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

ఎమ్మెల్యే కోటా కింద..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలకు సీఎండీఎఫ్‌ కింద రూ.20 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో విడుదల చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రూ.2 కోట్ల చొప్పున కేటాయించడంతో పాటు ఆ నిధులను కూడా అభివృద్ధికి వెచ్చించి త్వరగా పనులను పూర్తి చేయిస్తున్నారు. ఇలా గ్రామ సచివాలయాలకు, ఎమ్మెల్యేలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వ రూ.173 కోట్ల భారీ నిధులను వివిధ అభివృద్ధి పనుల మంజూరు చేసింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..

అభివృద్ధికి ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించింది. అలాగే ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులను కింద సీఎం కేటాయించారు. వీటితో గ్రామ, వార్డు స్థాయిలో త్వరగా ప్రగతి పనులు జోరందుకున్నాయి. – జెడ్పీ సీఈఓ, చిరంజీవి

ఏ పనులు చేశారంటే..

గ్రామ, వార్డు స్థాయిలో అంతర్గత రోడ్డు మరమ్మతులు, సీసీరోడ్ల నిర్మాణం.

తాగునీటి ట్యాంకులు, కుళాయిల ఏర్పాటుతో గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం.

శ్మశానవాటికలను అభివృద్ధి చేయడంతో పాటు, శ్మశానాల చుట్టూ ప్రహరీల నిర్మాణం.

గ్రామాల్లోని కాలనీల్లో విద్యుత్‌ స్తంభాలతో పాటు విద్యుత్‌ లైన్ల ఏర్పాటు.

సైడ్‌ కాలువల నిర్మాణం, ఆధునికీకరణ.

మొత్తం గ్రామ,

వార్డు సచివాలయాలు : 769

సచివాలయాలకు కేటాయించిన నిధులు :

రూ.153.8 కోట్లు

ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులు :

రూ.20 కోట్లు

మారిన గ్రామ, పట్టణ రూపురేఖలు

స్థానిక సమస్యలకు

సకాలంలో పరిష్కారం

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top