AUS vs ZIM: ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా

Zimbabwe beats Australia in 3rd ODI, first win in eight years - Sakshi

టాన్స్‌విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేల్లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే బిగ్‌ షాక్‌  ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ నుంచి పర్యటక జట్టు తప్పించుకుంది. కాగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ఆస్ట్రేలియా 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్‌ ర్యాన్‌ బర్ల్‌ 5 వికెట్లు పడగొట్టి  ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌(94) మినహా మిగితా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. కాగా అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్‌  రెగిస్‌ చకబ్వా (37 నటౌట్‌), ఓపెనర్‌ తాడివానాషే మారుమని (35) పరుగులతో రాణించారు.

8 ఏళ్ల తర్వాత తొలి విజయం
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని జింబాబ్వే నమోదు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వేకు ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వేకు ఇది మూడో విజయం కావడం విశేషం. తొలి సారిగా 1983 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. అనంతరం 2014లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయ భేరి మోగించింది.
చదవండి: AUS vs ZIM: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top