వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్‌కు తొలిసారి స్వర్ణం లభించింది. భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్- లక్షయ్ కలిసి ఈ ఈవెంట్లో దేశానికి తొలి పసిడి పతకం అందించారు. స్విట్జర్లాండ్ వేదికగా లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ విభాగంలో వీరు 6:26.09 నిమిషాల్లో రేసు పూర్తి చేశారు.
తద్వారా అత్యంత వేగంగా రేసు పూర్తి చేసిన జోడీగా నిలిచి భారత్‌కు స్వర్ణ పతకం అందించారు. రెండు, మూడు స్థానాల్లో హాంకాంగ్ (6:27.14), నెదర్లాండ్స్ ((6:27.36) నిలిచి రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.


