
అడపాదడపా మెరిపించడమే కాదు తమదైన రోజున చిరస్మరణీయ ప్రదర్శనతో పెద్ద జట్లను బోల్తా కొట్టించే ప్రావీణ్యం తమలో ఉందని అఫ్గానిస్తాన్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది. వరుసగా మూడో వన్డే
ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఎట్టకేలకు ఈ మెగా ఈవెంట్‌లో 14 వరుస పరాజయాలకు తెరదించింది. సంచలన ఆటతీరుతో ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టునే మట్టికరిపించింది.
ఇక నుంచి తమను కూన జట్టుగా పరిగణించకూడదని మిగతా జట్లకు హెచ్చరికలు పంపించింది. 2015 ప్రపంచకప్ లో ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం స్కాట్లాండ్‌పై గెలిచిన అఫ్గానిస్తాన్... ఆ తర్వాత 2019 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తాజా ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఓడిన అఫ్గానిస్తాన్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొంది పరాజయాల
పరంపరకు ముగింపు పలికింది.
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్! అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. ఆదివారం జరిగిన పోరులో హష్మతుల్లా కెపె్టన్సీలోని అఫ్గానిస్తాన్ 69 పరుగుల తేడాతో బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టుపై జయభేరి మోగించింది. ముందుగా అఫ్గానిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ రహా్మనుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆదిల్ రషీద్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రషీద్ ఖాన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ చెరో 3 వికెట్లు తీయగా, నబీకి 2 వికెట్లు దక్కాయి.
నడిపించిన గుర్బాజ్
జద్రాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రహ్మానుల్లా గుర్బాజ్ చెలరేగాడు. మూడో ఓవర్ నుంచి భారీ సిక్సర్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. వోక్స్, టోప్లీ, స్యామ్ కరన్‌ల పేస్... గుర్బాజ్ బౌండరీలు, సిక్సర్లతో విలవిలాడింది. 11వ ఓవర్లో ఆదిల్ రషీద్‌ను దించితే బౌండరీ బాది 33 బంతుల్లో గుర్బాజ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12.4వ ఓవర్లోనే అఫ్గాన్ స్కోరు వందకు చేరింది. 114 స్కోరువద్ద జద్రాన్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను అవుట్ చేసిన రషీద్ ఇంగ్లండ్ శిబిరాన్ని కాస్త ఊపిరి తీసుకోనిచ్చాడు. స్వల్ప వ్యవధిలో రహ్మత్ షా (3), గుర్బాజ్ అవుటైనప్పటిపీ ఇక్రమ్ అలీఖిల్ అర్ధసెంచరీ, లోయర్ ఆర్డర్‌లో రషీద్ ఖాన్ (22 బంతుల్లో 23; 3 ఫోర్లు), ముజీబ్ ఉర్ రెహా్మన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన విలువైన పరుగులు అఫ్గాన్ పటిష్టమైన స్కోరుకు బాట వేసింది.
బాధ్యతలేని బ్యాటింగ్‌తో...
స్కోరు పెద్దదే. కానీ అఫ్గాన్ బౌలింగ్‌పై ఈ లక్ష్యం ఇంగ్లండ్‌కు అసాధ్యమైందేమీ కాదు. బ్యాటర్లకు కష్టమైందీ కాదు. కానీ బాధ్యత లేని బ్యాటింగ్, చెత్త షాట్లతో జట్టు ఓటమినే మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. రెండో ఓవర్లోనే బెయిర్‌స్టో (2) లాంటి ఓపెనర్ అవుటైతే... రూట్ (11), కెపె్టన్ బట్లర్ (9)లాంటి అనుభవజు్ఞలు క్రీజును అంటిపెట్టుకోవాల్సింది పోయి... సులువుగా క్లీన్‌బౌల్డయ్యారు. దీంతో మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశాల్ని అఫ్గాన్ అన్ని వైపులా ముమ్మరం చేసింది. మలాన్ (39 బంతుల్లో 32; 4 ఫోర్లు) చేసిన మోస్తరు పరుగులు, హ్యారీ బ్రూక్ అర్ధసెంచరీ
ఇంగ్లండ్‌ను కాపాడలేకపోయాయి.
స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (రనౌట్) 80;
ఇబ్రహీమ్ (సి) రూట్ (బి) రషీద్ 28; రహ్మత్ షా (స్టంప్డ్) బట్లర్ (బి) ఆదిల్ రషీద్ 3; హష్మతుల్లా (బి) రూట్ 14; అజ్మతుల్లా (సి) వోక్స్ (బి) లివింగ్‌స్టోన్ 19; ఇక్రమ్ (సి) స్యామ్ కరన్ (బి) టోప్లీ 58; నబీ (సి) రూట్ (బి) వుడ్ 9; రషీద్ (సి) రూట్ (బి) రషీద్ 23; ముజీబ్ (సి) రూట్ (బి) వుడ్ 28; నవీనుల్ హక్ (రనౌట్) 5; ఫరూఖీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 284.
వికెట్ల పతనం: 1–114, 2–122, 3–122, 4–152, 5–174, 6–190, 7–233, 8–277, 9–277, 10–284.
బౌలింగ్: వోక్స్ 4–0–41–0, టోప్లీ 8.5–1–52–1, కరన్ 4–0–46–0, ఆదిల్ రషీద్ 10–1–42–3, వుడ్ 9–0–50–2, లివింగ్‌స్టోన్ 10– 0–33–1, రూట్ 4–0–19–1.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫరూఖీ 2; మలాన్ (సి) ఇబ్రహీమ్ (బి) నబీ 32, రూట్ (బి) ముజీబ్ 11; బ్రూక్ (సి) ఇక్రమ్ (బి) ముజీబ్ 66; బట్లర్ (బి) నవీనుల్ 9; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 10; స్యామ్ కరన్ (సి) రహ్మత్ (బి) నబీ 10; వోక్స్ (బి) ముజీబ్ 9; ఆదిల్ రషీద్ (సి) నబీ (బి) రషీద్ 20; వుడ్ (బి) రషీద్ 18; టోప్లీ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–3, 2–33, 3–68, 4–91, 5–117, 6– 138, 7–160, 8–169, 9–198, 10–215.
బౌలింగ్: ముజీబ్ 10–1–51–3, çఫరూఖీ 7–0–50–1, నవీనుల్ హక్ 6–1–44–1, నబీ 6–0–16–2, రషీద్ ఖాన్ 9.3–1–37–3, అజ్మతుల్లా 2–0–13–0.
ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X శ్రీలంక
వేదిక: లక్నో
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం