
క్విటో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఈక్వెడార్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్ అలెక్స్ క్వినెజ్‌ను దుండగులు కాల్చిచంపారు. గ్వాయకిల్ నగరంలో అతను కాలి్చవేతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 32 ఏళ్ల అలెక్స్ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు.
టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు’ అనే నిబంధన అతిక్రమించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అథ్లెట్ మృతిపట్ల ఈక్వెడార్ అధ్యక్షుడు గులెర్మో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’