8 జట్లు.. 15 మ్యాచ్‌లు.. ఆసియా కప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే? | Womens Asia Cup 2024: Here's The Details Of Schedule, Squads, Live Telecast And All You Need To Know | Sakshi
Sakshi News home page

Womens Asia Cup 2024: 8 జట్లు.. 15 మ్యాచ్‌లు.. ఆసియా కప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే?

Jul 18 2024 11:21 AM | Updated on Jul 18 2024 12:04 PM

Womens Asia Cup 2024: Schedule, squads, live telecast and all you need to know

శ్రీలంక వేదిక‌గా మ‌హిళ‌ల ఆసియాక‌ప్‌-2024కు మ‌రో 24 గంట‌ల్లో తెర‌లేవ‌నుంది. జూలై 19(శుక్ర‌వారం) దంబుల్లా వేదిక‌గా నేపాల్, యూఏఈ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో  8 జట్లు పాల్గొంటున్నాయి.

 మొత్తం 8 జ‌ట్ల‌ను రెండు గ్రుపుల‌గా విభిజించారు. గ్రూపు-ఎలో భార‌త్‌, పాకిస్తాన్‌, నేపాల్‌, యూఏఈలు ఉండ‌గా..   బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌ జట్లు గ్రూప్‌-బిలో చోటు దక్కించుకున్నాయి. ఈ క్ర‌మంలో ఆసియాక‌ప్‌-2024 షెడ్యూల్‌, జ‌ట్లు, లైవ్ స్ట్రీమింగ్ త‌దిత‌ర వివరాల‌ను తెలుసుకుందాం.

ఆసియాక‌ప్ షెడ్యూల్ ఇదే.. 
జూలై 19, శుక్రవారం - యూఏఈ వ‌ర్సెస్‌ నేపాల్ - 2:00 PM
జూలై 19, శుక్రవారం - భారత్‌ వ‌ర్సెస్ పాకిస్తాన్ - 7:00 PM
జూలై 20, శనివారం - మలేషియా వ‌ర్సెస్‌ థాయిలాండ్ - 2:00 PM
జూలై 20, శనివారం - శ్రీలంక వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్ - 7:00 PM
జూలై 21, ఆదివారం -  భారత్‌ వ‌ర్సెస్ యూఏఈ - 2:00 PM
జూలై 21, ఆదివారం - పాకిస్తాన్ వ‌ర్సెస్‌ నేపాల్ - 7:00 PM
జూలై 22, సోమవారం - శ్రీలంక వ‌ర్సెస్ మలేషియా - 2:00 PM
జూలై 22, సోమవారం - బంగ్లాదేశ్ వ‌ర్సెస్‌ థాయిలాండ్ - 7:00 PM
జూలై 23, మంగళవారం - పాకిస్తాన్ డ‌ యూఏఈ - 2:00 PM
జూలై 23, మంగళవారం -  భారత్‌ వ‌ర్సెస్‌ నేపాల్ - 7:00 PM
జూలై 24, బుధవారం - బంగ్లాదేశ్ వ‌ర్సెస్ మలేషియా - 2:00 PM
జూలై 24, బుధవారం - శ్రీలంక వ‌ర్సెస్‌ థాయిలాండ్ - 7:00 PM
జూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 1 - 2:00 PM
జూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 2 - 7:00 PM
జూలై 28, ఆదివారం - ఫైనల్ - 7:00 PM

ఆసియాకప్‌లో పాల్గోనే జట్లు ఇవే.. 

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌), ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్ - ట్రావెలింగ్ రిజర్వ్‌లు: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్

థాయిలాండ్: తిపట్చా పుట్టావాంగ్ (కెప్టెన్), సువనన్ ఖియాటో (వాక్), నన్నపట్ కొచరోయెంకై (వాక్), నట్టయా బూచతం, ఒన్నిచా కమ్‌చోంఫు, రోసెనన్ కానో, ఫన్నితా మాయ, చనిదా సుత్తిరువాంగ్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ ఫొనాంగ్‌టానా చాపతన్‌సేన్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ బూంతన్‌సాన్‌సన్, చపతన్‌సేన్, కోరనిత్ సువంచోంరతి, అఫిసర సువంచోంరతి

మలేషియా: వినిఫ్రెడ్ దురైసింగం (కెప్టెన్), ఐనా నజ్వా (వికెట్ కీప‌ర్‌), ఎల్సా హంటర్, మాస్ ఎలిసా, వాన్ జూలియా (వికెట్ కీప‌ర్‌), అయిన హమీజా హషీమ్, మహిరా ఇజ్జతీ ఇస్మాయిల్, నూర్ అరియానా నాట్యా, ఐస్యా ఎలీసా, అమలిన్ సోర్ఫినా, ధనుశ్రీ ముహునాన్, ఇర్డ్నా బెహనాన్ , నూర్ ఐషా, నూర్ ఇజ్జతుల్ సయాఫికా, సుయాబికా మణివణ్ణన్

నేపాల్: ఇందు బర్మా (కెప్టెన్), సీతా రాణా మగర్, రాజమతి ఐరీ, రుబీనా ఛెత్రీ, డాలీ భట్టా, మమతా చౌదరి, కబితా జోషి, కబితా కున్వర్, కృతికా మరాసిని, పూజ మహతో, బిందు రావల్, రోమా థాపా, సబ్‌నమ్ రాయ్, సంజన ఖడ్కా, (వికెట్ కీప‌ర్‌)

యుఎఈ: ఇషా ఓజా (కెప్టెన్), తీర్థ సతీష్ (వికెట్ కీప‌ర్‌), ఎమిలీ థామస్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, లావణ్య కెనీ, ఖుషీ శర్మ, ఇంధుజా నందకుమార్, రినిత రజిత్, రిషిత రజిత్, వైష్ణవే మహేష్, సురక్షా కొట్టె, హీనా హాట్‌చందనీ, మెహక్‌చందనీ, రితికా రజిత్

పాకిస్థాన్: నిదా దార్ (కెప్టెన్‌), ఇరామ్ జావేద్, సాదియా ఇక్బాల్, అలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునీబా అలీ, సిద్రా అమీన్, నజిహా అల్వీ, సయ్యదా అరూబ్ షా, నష్రా సుంధు, తస్మియా రుబాబ్, ఒమైమా సోహైల్, తుబా హసన్ .

శ్రీలంక: చమరి అతపత్తు (కెప్టెన్‌), అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, కావ్య కవింది, సుగండికా కుమారి, అచ్చిని కులసూర్య, కవీషా దిల్హరి, విష్మి గుణరత్నే, శనివా గుణరత్నే, శనివాణి సక్షిలా గిమ్హాని

బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్‌), షోర్నా అక్టర్, నహిదా అక్టర్, ముర్షిదా ఖాతున్, షోరిఫా ఖాతున్, రీతు మోని, రుబ్యా హైదర్ ఝెలిక్, సుల్తానా ఖాతున్, జహనారా ఆలం, దిలారా అక్టర్, ఇష్మా తంజిమ్, రబేయా ఖాన్, రుమానా అహ్మద్, సబికున్ అక్టర్, నహర్ జెస్మిన్
మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదేవిధంగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌ల‌ను వీక్షించవ‌చ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement