వార్నర్‌ కూడా అవుట్‌ 

Warner ruled out from the series - Sakshi

భారత్‌తో మిగతా టెస్టులకు దూరమైన ఆసీస్‌ ఓపెనర్‌  

న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్‌ బౌలర్‌ హాజల్‌వుడ్‌ సిరీస్‌ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్‌వుడ్‌ సరసన తాజాగా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్‌ ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు.

అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్‌ మోచేతికి ఫ్రాక్చర్‌ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది.

నాలుగు టెస్టుల సిరీస్‌ ముగిశాక జరిగే వన్డే సిరీస్‌ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్‌ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రెన్‌షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top