‘కోహ్లి కాన్ఫిడెన్స్‌ అలా ఉంటుంది’ | Virat Kohli Is A Very Confident Man, Pragyan Ojha | Sakshi
Sakshi News home page

‘కోహ్లి కాన్ఫిడెన్స్‌ అలా ఉంటుంది’

Oct 3 2020 5:41 PM | Updated on Oct 3 2020 7:58 PM

Virat Kohli Is A Very Confident Man, Pragyan Ojha - Sakshi

అబుదాబి: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న కోహ్లి త్వరలోనే తన బ్యాట్‌ ద్వారా సమాధానం చెబుతాడన్నాడు. ప్రస్తుతం ఉన్న అతని పేలవమైన ఫామ్‌ను కోహ్లి తప్పక అధిగమిస్తాడని ఓజా అభిప్రాయపడ్డాడు.  ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన ఓజా.. ‘విరాట్‌ కోహ్లి కాన్ఫిడెంట్‌ మ్యాన్‌. కోహ్లి గురించి మాట్లాడితే అతను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. కోహ్లి విశ్వసించదగిన క్రికెటర్‌. కోహ్లి ఆటను తొలి రోజు నుంచి చూస్తే సత్తాచాటడానికే యత్నిస్తూ ఉంటాడు. (చదవండి: ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌.. ఇది ఔటా?)

అది టీమిండియా జట్టుకైనా, నా జట్టుకైనా, ఏ జట్టుకైనా కోహ్లి ఒకేలా ఆడతాడు. మొన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో డివిలియర్స్‌ సూపర్‌ ఓవర్‌లో ఆడటానికి వెళ్లే క్రమంలో కోహ్లి కూడా నేను కూడా వస్తాను అని వచ్చేశాడు. కోహ్లి కాన్ఫిడెంట్‌ అలా ఉంటుంది. ఎప్పుడూ నమ్మకంతోనే ఉంటాడు. సారథిగానైనా ఆటగాడిగానైనా కోహ్లి కాన్ఫిడెన్స్‌ లెవెల్సే వేరు. కోహ్లితో ఆడిన ఏ ఆటగాడికైనా గేమ్‌లో టాప్‌ లెవెల్‌ కోసమే చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ జట్టుకు పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తూ ఉంటాడు కోహ్లి. ఇప్పుడు కోహ్లిలో ఫామ్‌లో లేకపోవడం అనేది తాత్కాలికం. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడు. కోహ్లి ఫామ్‌లోకి రావడానికి 10 బంతులు చాలు’ అని ఓజా పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement