సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌!? కోహ్లి కీలక నిర్ణయం | Virat Kohli Not Travelling To South Africa For T20I And ODI Series: Reports - Sakshi
Sakshi News home page

SA Vs IND T20I And ODI Series: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌!? కోహ్లి కీలక నిర్ణయం

Nov 29 2023 12:54 PM | Updated on Nov 29 2023 1:28 PM

Virat Kohli not travelling to South Africa for T20I and ODI series: Reports - Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా భారత్‌.. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. డిసెంబర్‌ 10న డర్బన్‌ వేదికగా తొలి టీ20తో భారత జట్టు ప్రోటీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సౌతాఫ్రికా టూర్‌ కోసం భారత జట్టును బీసీసీఐ మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది.

విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం..
కాగా దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రోటీస్‌తో వైట్‌ బాల్‌ సిరీస్‌లకు దూరంగా ఉండాలని విరాట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి కోహ్లి తెలియజేసినట్లు భారత క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌​కు విరాట్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు కింగ్‌ కోహ్లి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ విరాట్‌ మాత్రం తన బ్రేక్‌ను మరి కొన్ని రోజులు పొడిగించాలనుకుంటున్నాడు. కాగా విరాట్‌ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనంతరం వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement