చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. 49వ సెంచరీ! సచిన్‌ వరల్డ్‌ రికార్డు సమం | Virat kohli equals sachin tendulkar most odi centuries record | Sakshi
Sakshi News home page

World cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. 49వ సెంచరీ! సచిన్‌ వరల్డ్‌ రికార్డు సమం

Nov 5 2023 5:45 PM | Updated on Nov 5 2023 6:36 PM

Virat kohli equals sachin tendulkar most odi centuries record - Sakshi

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి తన 49వ సెంచరీని అందుకున్నాడు.

తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కింగ్‌ కోహ్లి సమం చేశాడు. కోహ్లి తన బర్త్‌డే రోజు ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. 119 బంతుల్లో 10 ఫోర్లతో కోహ్లి తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇది విరాట్‌కు 78 అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 121 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 10 ఫోర్లతో 101 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement