ఓపెనింగ్‌ జోడీ.. ఉత్కంఠకు తెరదించిన కోహ్లి | Virat Kohli Confirms Team India Opening Pair For 1st ODI Against England | Sakshi
Sakshi News home page

ఓపెనింగ్‌ జోడీ.. ఉత్కంఠకు తెరదించిన కోహ్లి!

Mar 22 2021 4:45 PM | Updated on Mar 22 2021 6:07 PM

Virat Kohli Confirms Team India Opening Pair For 1st ODI Against England - Sakshi

జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏస్థానంలో ఆడేందుకైనా నేను సిద్ధమే

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో ఓపెనింగ్‌ విషయంలో టీమిండియా అనుసరించిన వ్యూహం సత్ఫలితాన్ని ఇచ్చిన విషయం విదితమే. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు జతగా వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 80 పరుగులతో సత్తా చాటాడు. రోహిత్‌ శర్మ(64), కోహ్లి(80- నాటౌట్‌) అర్ధ సెంచరీలతో పాటు సూర్యకుమార్‌(32), హార్దిక్‌ పాండ్యా మెరుగ్గా రాణించడంతో ఇంగ్లండ్‌కు 225 పరుగుల భారీ లక్ష్యం విధించిన టీమిండియా, భువీ, నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, పాండ్యాల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై 36 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇక ఆ మ్యాచ్‌ ముగిసిన నాటి నుంచి ఓపెనింగ్‌ జోడీపై క్రికెట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి, వన్డేల్లోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రేపటి(మార్చి 23) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న తరుణంలో కోహ్లి మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్కంఠకు తెరదించాడు. ‘‘ శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ.. వీరే కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తారు.  వన్డే ఫార్మాట్‌లో ఇందుకు సంబంధించి అనుమానాలే అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వారిద్దరు అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నారు’’ అని స్పష్టతనిచ్చాడు. 

ఇక ఓపెనర్‌గా తన పాత్ర ఏమిటన్న అంశంపై కోహ్లి స్పందిస్తూ.. రోహిత్‌ చెప్పినట్లుగా మేం పటిష్టమైన వ్యూహంతోనే మొన్నటి మ్యాచ్‌లో ఓపెనింగ్‌ చేశాం. తనతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. ఇద్దరం కలిసి ఆడటం మ్యాచ్‌ను ఎంతగా ప్రభావితం చేసిందో అందరూ చూశారు. అయితే భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందా లేదా అంటే ఇప్పుడే చెప్పలేను. ఐపీఎల్‌లో మాత్రం ఓపెనర్‌గా ఉంటాను. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ నాటికి ఓపెనర్‌గా నా పాత్ర ఎలా ఉండాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏస్థానంలో ఆడేందుకైనా నేను సిద్ధమే’’అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 

వన్డే సిరీస్‌- టీమిండియా జట్టు:  విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ(వైస్‌ కెప్టెన్‌)‌, ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, చాహ‌ల్‌, కుల్‌దీప్‌, కృనాల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, శార్దూల్ ఠాకూర్

చదవండి: అప్పుడే అంత తొందర ఎందుకు?: రోహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement