జు వెన్‌జున్‌తో పోరుకు సిద్ధం: వైశాలి | Vaishali reacts on Womens World Chess Championship | Sakshi
Sakshi News home page

జు వెన్‌జున్‌తో పోరుకు సిద్ధం: వైశాలి

Apr 20 2026 4:00 AM | Updated on Apr 20 2026 4:00 AM

Vaishali reacts on Womens World Chess Championship

చెన్నై: మహిళల ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి ప్‌ టైటిల్‌ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్‌లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్‌ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం స్వస్థలం చెన్నైకు చేరుకున్న వైశాలికి ఘనస్వాగతం లభించింది. 

క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత హోదాలో వైశాలికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో తలపడే అవకాశం లభించింది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో జు వెన్‌జున్‌ 2018 నుంచి విశ్వవిజేతగా కొనసాగుతోంది. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. నేను ఎన్నో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌లను చూశాను. 

ఇప్పుడు నేనే ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాను. ఈ పోరు కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని వైశాలి తెలిపింది. ఈ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ టైటిల్‌ పోరులో భారత గ్రాండ్‌మాస్టర్లు, తమిళనాడు ప్లేయర్లు (గుకేశ్, వైశాలి) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌ల ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ దాఖలు చేయాలని అఖిల భారత చెస్‌ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement