వైభ‌వ్ బాధ్య‌త వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీల‌క వ్యాఖ్య‌లు | Vaibhav Sooryavanshi: Before India Comes Calling, BCCI Gets Urgent Plea | Sakshi
Sakshi News home page

వైభ‌వ్ బాధ్య‌త వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీల‌క వ్యాఖ్య‌లు

May 27 2026 6:28 PM | Updated on May 27 2026 6:45 PM

Vaibhav Sooryavanshi: Before India Comes Calling, BCCI Gets Urgent Plea

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌న్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. 

దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంత‌కంటే ముందు వ‌చ్చే నెలలో శ్రీలంక వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ముక్కోణ‌పు సిరీస్‌లో భార‌త్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున వైభ‌వ్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. తిల‌క్ వ‌ర్మ సార‌థ్యంలో అత‌డు ఆడ‌నున్నాడు. ఈ సిరీస్‌లో కూడా అత‌డు మెరుగ్గా రాణిస్తే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ భ‌విష్య‌త్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్‌, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 583 పరుగులు సాధించి ఆరెంజ్‌క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.

"వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్‌పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.

అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం  ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్‌డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్‌కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.
చదవండి: IPL 2026: రాజస్తాన్‌తో ఎలిమినేటర్‌.. సన్‌రైజర్స్‌ తుది జట్టు ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement