క్రికెట్‌లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే! | Usain Bolt set to play T20 cricket says Report | Sakshi
Sakshi News home page

Usain Bolt: క్రికెట్‌లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే!

Dec 9 2021 1:42 PM | Updated on Dec 9 2021 4:06 PM

Usain Bolt set to play T20 cricket says Report - Sakshi

Usain Bolt set to play T20 cricket..?:  ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈ లీగ్‌ కోసం బోల్ట్‌ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన  పూర్తి వివరాలు  తెలిసే అవకాశముంది.

కాగా బోల్ట్‌ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో  బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్‌ నుంచి బోల్ట్‌ రిటైర్‌మ్మెంట్‌ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్‌ అంటే ఇష్టమని బోల్ట్‌ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్‌ లవ్‌’ అని బోల్ట్  చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్‌ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే.

చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement