India Tour Of Zimbabwe: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న టీమిండియా

Team India Celebrates Independence Day In Zimbabwe - Sakshi

Team India Celebrates Independence Day In Harare: 3 వన్డేల సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అక్కడే ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులతో పాటు కోచింగ్‌, సహాయక సిబ్బంది అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెగ్యులర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీలో ఈ సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో టీమిండియా సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత బృంద సభ్యులంతా జాతీయ జెండా ముందు నిల్చొని ఫోటోలు దిగారు. ఇదిలా ఉంటే, జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఈ నెల (ఆగస్ట్‌) 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా నేరుగా యూఏఈ వెళ్లి ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా టీమిండియా ఈనెల 28న తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది.       
చదవండి: 'విండీస్‌ సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్‌గా నో ఛాన్స్‌'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top