T20 World Cup 2021: Today England To Face Team India In Warm Up Match - Sakshi
Sakshi News home page

20 World Cup 2021: నేడే భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌

Oct 18 2021 6:06 PM | Updated on Oct 18 2021 6:58 PM

T20 World Cup 2021: Today England To Face Team India In Warm Up Match - Sakshi

T20 World Cup 2021: India Vs England Warm Up Match: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య ఈ నెల 24న రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే టీమిండియా రెండు వార్మప్‌(అక్టోబర్‌ 18న ఇంగ్లండంతో, 20న ఆస్ట్రేలియాతో) మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో భాగంగా ఇవాళ ఇంగ్లండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లను సైతం టోర్నీ అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

ఇక, నేటి మ్యాచ్‌లో భారత జట్టు కూర్పు విషయానికొస్తే.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్‌గా రిషబ్‌ పంత్ ఆడతారని తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా అన్నది వేచి చూడాలి. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి, పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడటం ఖాయమని సమాచారం. కాగా, ఇప్పటికే మెగా టోర్నీ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సూపర్ 12 స్టేజ్‌ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభంకానున్నాయి.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement