
సౌతాఫ్రికా మెన్స్ క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఈ ఏడాది ఆక్టోబర్‌లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా దక్షిణఫ్రికా ఆతిథ్య పాక్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ధ్రువీకరించింది. సౌతాఫ్రికా జట్టు రాక కోసం ఎదురుచూస్తున్నట్లు పీసీబీ సీఈఓ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌తో పాక్ తమ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను ఆరంభించనుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో షాన్ మసూద్ అండ్ కో ఆఖరి స్ధానంలో నిలిచింది.
గత సైకిల్‌లో ఆడిన 14 టెస్ట్‌లలో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా టాప్-2లో నిలవాలని పట్టుదలతో మెన్ ఇన్ గ్రీన్ ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్ కోసం దాదాపు రెండు వారాల ట్రైనింగ్ క్యాంపును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ముందు పాక్.. ఆ తర్వాత భారత్
సౌతాఫ్రికా పాకిస్తాన్ పర్యటన ముగించుకుని నేరుగా భారత్‌కు రానుంది. ప్రోటీస్ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడనుంది. సఫారీల భారత పర్యటన నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. కాగా సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సౌతాఫ్రికా పాక్‌తో వారి స్వదేశంలో చివరగా 2021 టెస్టు సిరీస్ ఆడింది. ప్రోటీస్ జట్టు పాక్ పర్యటన నవంబర్ 8 న ముగియనుంది.
పాక్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్
తొలి టెస్టు- అక్టోబర్ 12–16- గడాఫీ స్టేడియం, లాహోర్
రెండో టెస్టు- అక్టోబర్ 20-24- రావల్పిండి క్రికెట్ స్టేడియం
తొలి టీ20- ఆక్టోబర్ 28- రావల్పిండి క్రికెట్ స్టేడియం
రెండో టీ20- అక్టోబర్-31- గడాఫీ స్టేడియం, లాహోర్
మూడో టీ20- నవంబర్ -1- గడాఫీ స్టేడియం, లాహోర్
తొలి వన్డే-నవంబర్-4- ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్
రెండో వన్డే- నవంబర్-6- ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్
మూడో వన్డే- నవంబర్ -8 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్
చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన