
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) మరోసారి విఫలమయ్యాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో (Pakistan Vs South Africa) 16 పరుగులకే ఔటయ్యాడు. బాబర్ వరుస వైఫల్యాలు చూసి సొంత అభిమానులే విసుగెత్తిపోయారు.
మిగతా దేశ క్రికెట్ అభిమానులైతే.. వీడిని ఎలా భరిస్తున్నార్రా సామీ అంటూ తలలు బాదుకుంటున్నారు. పాక్ క్రికెట్ బోర్డుకు గతిలేక ఈ జింబాబర్‌ను పట్టుకొని వేలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు.
రెండేళ్లైపోయింది..!
బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. అతను చివరిగా 2023 ఆగస్ట్ 30న పసికూన నేపాల్‌పై వన్డే సెంచరీ చేశాడు. అప్పటి నుంచి 73 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేకపోయాడు. మధ్యలో అడపాదడపా అర్ద సెంచరీలు మాత్రమే చేశాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆల్ ఫార్మాట్ కెప్టెన్సీని కోల్పోయిన బాబర్ ప్రస్తుతం జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. అతన్ని పొట్టి ఫార్మాట్ నుంచి ఇదివరకే పక్కన పెట్టేశారు. వన్డేల్లో, టెస్ట్‌ల్లో గత్యంతరం లేక పాక్ క్రికెట్ బోర్డు అతన్ని కొనసాగిస్తుంది.
రెండేళ్లకు పైగా ఫామ్ కోల్పోయిన బాబర్‌ను పాక్ అభిమానులు ఓ దశలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో పోల్చారు. ఇప్పుడు కూడా కొందరు పాకీలు బాబర్ ఆజమ్ విరాట్ కంటే మెరుగైన బ్యాటర్ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంటారు. సోషల్‌మీడియాలో బాబర్ అభిమానుల ఓవరాక్షన్‌కు కొందరు చురుకలంటిస్తుంటారు. అయినా వారి తంతు అలాగే కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో (23, 42) విఫలమయ్యాడు.
తాజాగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే తంతు కొనసాగింది. ఇవాళే (అక్టోబర్ 20) మొదలైన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 69 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16) ఔట్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (85), సౌద్ షకీల్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం