Kohli-Ganguly: విరాట్‌ కోహ్లిపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Sourav Ganguly Says I Like Virat Kohli Attitude Much But He Fights Lot - Sakshi

Sourav Ganguly Comments About Virat Kohli.. కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంతవరకు ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే బోర్డు అంతర్గత విషయాలను కోహ్లి బయటకు చెప్పడం ఏంటని కొందరు గుర్రుగా ఉండగా.. మరికొందరు కోహ్లికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే గంగూలీకి, కోహ్లికి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవలే జరిగిన ఒక మీడియా సమావేశంలోనూ గంగూలీ వద్ద  కోహ్లి కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని ప్రస్తావించగా.. ''ఇక్కడితో వదిలేయండని.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని'' సమాధానమిచ్చాడు. 

చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్‌ భయ్యా ఎక్కడున్నావు!?

తాజాగా డిసెంబర్‌ 18న గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గంగూలీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా  మీడియా సమావేశంలో గంగూలీ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ కార్యక్రమంలో ఏ క్రికెటర్‌ యాటిట్యూడ్‌ మీకు బాగా నచ్చిందనే ప్రశ్న గంగూలీకి ఎదురైంది. దీనికి గంగూలీ నోటి నుంచి కోహ్లి పేరు సమాధానంగా రావడం ఆసక్తి కలిగించింది. '' విరాట్ కోహ్లి వైఖరి(యాటిట్యూడ్‌) నాకు చాలా ఇష్టం. అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడు. కానీ కోపం ఎక్కువ.'' అని చెప్పుకొచ్చాడు. ఒక రకంగా కోహ్లీతో ఇటీవల జరిగిన ఘర్షణకు సంబంధించి గంగూలీ నేరుగా ఈ విషయాన్ని చెప్పకపోయినా.. హావభావాల్లో మాత్రం భారత మాజీ కెప్టెన్ కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. “జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. మనకు ఒత్తిడిని భార్య, స్నేహితులు మాత్రమే ఇస్తారు” అని సరదాగా పేర్కొన్నాడు.

చదవండి: IND Vs SA: భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!

ఇక గంగూలీపై కోహ్లి చేసిన వ్యాఖ్యల పట్ల బోర్డు ఏ మేరకు చర్యలు తీసుకుంటుందోనని ఆసక్తి రేకేత్తించింది. అయితే టీమిండియాకు దక్షిణాఫ్రికా పర్యటన ముఖ్యం కావడంతో ఇప్పుడున్న కోహ్లి వివాదాన్ని కొనసాగించడానికి బీసీసీఐ ఇష్టపడడం లేదు. అందువల్ల ఈ విషయంలో బోర్డు ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా పత్రికా ప్రకటనను జారీ చేయడం లేదని సమాచారం. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా డిసెంబర్‌ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ గాయంతో దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top