న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్‌ | SL vs NZ 2nd Test: Dinesh Chandimal Slams 16th Test Century | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్‌

Sep 26 2024 3:27 PM | Updated on Sep 26 2024 3:30 PM

SL vs NZ 2nd Test: Dinesh Chandimal Slams 16th Test Century

శ్రీలంక వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ చండీమల్‌ టెస్ట్‌ క్రికెట్‌లో రెండేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చండీమల్‌ ఎట్టకేలకు సెంచరీ మార్కు తాకాడు. చండీమల్‌ 2022, మేలో చివరిసారిగా (బంగ్లాదేశ్‌పై) టెస్ట్‌ల్లో మూడంకెల స్కోర్‌ చేశాడు. 

చండీమల్‌కు ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. చండీమల్‌ సెంచరీ చేసిన తొమ్మిదో దేశం న్యూజిలాండ్‌. చండీమల్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు తొమ్మిది వేర్వేరు దేశాలపై (బంగ్లాదేశ్‌పై 5, భారత్‌పై 2, ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్‌పై 2, ఇంగ్లండ్‌పై 1, ఆఫ్ఘనిస్తాన్‌పై 1, ఐర్లాండ్‌పై 1, పాకిస్తాన్‌పై 1, న్యూజిలాండ్‌పై 1) 16 సెంచరీలు చేశాడు.  

కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పథుమ్‌ నిస్సంక (1), దిముత్‌ కరుణరత్నే (46) ఔట్‌ కాగా.. చండీమల్‌ (106), ఏంజెలో మాథ్యూస్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు. నిస్సంక వికెట్‌ సౌథీకి దక్కగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌ సెంచరీతో.. ప్రభాత్‌ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. 

చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్‌, హెట్‌మైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement