మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్‌, హెట్‌మైర్‌ | CPL 2024 GUY Vs BR: Shai Hope And Shimron Hetmyer Take Warriors To Victory Over Royals, See Details | Sakshi
Sakshi News home page

CPL 2024 GUY Vs BR: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్‌, హెట్‌మైర్‌

Sep 26 2024 2:42 PM | Updated on Sep 26 2024 3:45 PM

CPL 2024: Shai Hope And Shimron Hetmyer Take Warriors To Victory Over Royals

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో భాగంగా బార్బడోస్‌ రాయల్స్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌.. షాయ్‌ హోప్‌ (37 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (34 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ఆజమ్‌ ఖాన్‌ 17 బంతుల్లో 26 పరుగులు.. రొమారియో షెపర్డ్‌ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో తీక్షణ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్‌ హోల్డర్‌, కేశవ్‌ మహారాజ్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్‌ మిల్లర్‌ (34 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. క్వింటన్‌ డికాక్‌ ఓ మోస్తరు స్కోర్‌ (35) చేశాడు. వీరిద్దరు మినహా రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. గడకేశ్‌ మోటీ 3, మొయిన్‌ అలీ, ఇమ్రాన్‌ తాహిర్‌ తలో 2, ప్రిటోరియస్‌, రొమారియో షెపర్డ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ప్రస్తుత సీపీఎల్‌ ఎడిషన్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి. 

చదవండి: విరాట్ కోహ్లి మ‌రో 35 ప‌రుగులు చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement