మహ్మద్‌ సిరాజ్‌ను కలిసిన నిర్మలా సీతారామన్‌.. | Sitharaman Meets Pacer Mohammed Siraj At Hyderabad | Sakshi
Sakshi News home page

CWC 2023: మహ్మద్‌ సిరాజ్‌ను కలిసిన నిర్మలా సీతారామన్‌..

Published Mon, Nov 20 2023 8:26 PM | Last Updated on Tue, Nov 21 2023 10:18 AM

Sitharaman Meets Pacer Mohammed Siraj At Hyderabad - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సిరాజ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిశారు. ఈ సందర్భంగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టును సీతారామన్‌ అభినందించారు.

అదే విధంగా  ఆటలో గెలుపు ఓటములు సహజమని సిరాజ్‌ను ఓదార్చారు. కాగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో గత 12 ఏళ్ల నుంచి ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
చదవండి: CWC Final: వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్‌ షా అఫ్రిది పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement