
టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 5వ క్రికెటర్‌గా షకీబ్ రికార్డులకెక్కాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో ఆంటిగ్వా అండ్ బార్బుడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్.. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
సెయింట్స్ కిట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేసిన అనంతరం షకీబ్ అల్ హసన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంగ్లా మాజీ కెప్టెన్ ఇప్పటివరకు 457 మ్యాచ్‌లు ఆడి 502 వికెట్లు పడగొట్టాడు.
ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (658 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. అదేవిధంగా షకీబ్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 7000 పరుగులతో పాటు 500 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా షకీబ్ నిలిచాడు.
ఈ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అక్టోబర్ 2024 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో మాత్రమే పాల్గొంటున్నాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..
రషీద్ ఖాన్- 487 మ్యాచ్‌లు- 660 వికెట్లు
డ్వైన్ బ్రావో- 582 మ్యాచ్‌లు- 631 వికెట్లు
సునీల్ నరైన్- 557 మ్యాచ్‌లు- 590 వికెట్లు
ఇమ్రాన్ తాహిర్- 436 మ్యాచ్‌లు- 554 వికెట్లు
షకీబ్ అల్ హసన్- 457 మ్యాచ్‌లు-502 వికెట్లు
చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైరల్