
దక్షిణాప్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాప్రికా చేరుకున్న టీమిండియా ఒక్క రోజు ఐషోలేషన్‌లో ఉండనుంది. ఇక టెస్ట్ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్‌కు శార్దూల్ ఠాకూర్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
“శార్దూల్ ఠాకూర్‌కు ఖచ్చితంగా స్థానం దక్కుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారత్ సాధించిన ప్రతీ విజయంలో అతడు కీలకపాత్ర పోషించాడు. అదే విధంగా విదేశీ పిచ్‌లపై కూడా అతడు రాణించగలడు. శార్దూల్ బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఇటువంటి సమయంలో భారత్‌కు ఠాకూర్ ఆటగాడు చాలా అవసరం. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి సాదరణంగా విదేశాల్లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుంటాడు. కోహ్లి వ్యూహం ఠాకూర్‌కు ఫేవర్‌గా ఉంటుందని" అతడు పేర్కొన్నాడు.
చదవండి: Sourav Ganguly: మొన్న ద్రవిడ్.. నిన్న లక్ష్మణ్.. ఇక సచిన్ వంతు... బిగ్ హింట్ ఇచ్చిన గంగూలీ