
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ (Sara Tendulkar) వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే మోడల్‌గా గుర్తింపు పొందిన సారా.. తాజాగా వెల్‌నెస్ సెంటర్‌ను ఆరంభించింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో తన పేరిట పైలేట్స్ అకాడమీ (Type of mind-body exercise)ని నెలకొల్పింది.
హైలైట్‌గా సానియా చందోక్
తల్లిదండ్రులు సచిన్- అంజలిలతో కలిసి సారా తన అకాడమీ పూజా కార్యక్రమంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఈ వీడియోలో అర్జున్ టెండుల్కర్‌కు కాబోయే భార్య సానియా చందోక్ (Saaniya Chandhok) హైలైట్‌గా నిలిచింది.
అర్జున్‌తో ఎంగేజ్‌మెంట్!
కాబోయే అత్తా- మామలు, వదినతో కలిసి సానియా ఈ పూజా కార్యక్రమాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్ తనయుడు తనయుడు అర్జున్ వివాహ నిశ్చితార్థం జరిగినట్లు గురువారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య బుధవారం ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిసింది. సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.
బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే
కాగా ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి ఘయ్ మనువరాలు సానియా. గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘయ్. ఫుడ్, హాస్పిటాలిటీ సెక్టార్‌లో ఈ గ్రూప్ పేరుగడించింది. ముంబైలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ బ్రాండ్ వీరిదే. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ‘బాస్కిన్ అండ్ రాబిన్స్’ బ్రాండ్‌తో ఉన్న ప్రీమియం చైన్ ఐస్‌క్రీమ్ పార్లర్లు బ్రూక్లిన్ క్రీమరి సంస్థకు చెందినవే. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కూడా ఆ సంస్థ ఉత్పత్తులే!
ఇక పరిమిత సంఖ్యలో, కేవలం ఆత్మీయుల మధ్యే జరిగిన ఎంగేజ్‌మెంట్‌పై ఇరు కుటుంబసభ్యులు గోప్యత పాటించడం గమనార్హం. వార్త బయటికి పొక్కినా... అటు రవి ఘయ్ కుటుంబం నుంచి గానీ, ఇటు సచిన్ కుటుంబం నుంచి గానీ ఇంకా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు. విషయం తెలిసిన ఐకాన్ క్రికెటర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కెరీర్‌లో వెనుకబాటు
కాగా 25 ఏళ్ల అర్జున్ లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ముందుగా ముంబై అండర్–19 జట్టు నుంచి క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతను చెప్పుకోదగిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రస్తుతం గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు.
కానీ ఇప్పటివరు కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి మూడే వికెట్లు తీయగలిగాడు. బ్యాట్ నుంచి ఇప్పటివరకు రాణించిన ఇన్నింగ్స్ లేదు. అర్జున్ చేయి అందుకున్న సానియా జంతు ప్రేమికురాలు. ముంబైలో ఉన్న పెంపుడు జంతువులు, మూగ జీవాల కోసం ఏర్పాటైన ‘మిస్టర్ పాస్’ను సానియా ప్రారంభించారు.
సారా రిలేషన్‌షిప్ స్టేటస్?
ఇదిలా ఉంటే.. అర్జున్.. అక్క సారా కంటే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సచిన్ తనయగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సారా.. బయోమెడికల్ సైంటిస్ట్, న్యూట్రీషనిస్ట్. అంతేగాకుండా సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గానూ సేవలు అందిస్తున్న సారా.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం అంబాసిడర్‌గానూ ఎంపికైంది.
కాగా టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై ఇంత వరకు ఇటు సారా.. అటు గిల్ నోరు విప్పలేదు. అయితే, తాజాగా తమ్ముడి నిశ్చితార్థం జరగడంతో సారా రిలేషన్‌షిప్ స్టేటస్ మరోసారి వైరల్ అవుతోంది.
చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్