
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన అతిపెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ 36 ఏళ్ల 161 రోజుల వయసులో ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ (36 ఏళ్ల 124 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అజారుద్దీన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
రోహిత్ తర్వాత స్ధానాల్లో వరుసగా అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్ (34 ఏళ్ల 71 రోజులు), ఎస్ వెంకటరాఘవన్(34 ఏళ్ల 56 రోజులు), ఎంఎస్ ధోని(33 ఏళ్ల 262 రోజులు) ఉన్నారు. కాగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో 2 సిక్స్‌లు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్‌ను రోహిత్ అధిగమిస్తాడు. గేల్ ఇప్పటివరకు 553 సిక్స్‌లు బాదగా.. రోహిత్ 551 సిక్స్‌లు కొట్టాడు.
చదవండి: #Viratkohli: ‘కోహ్లి డకౌట్ కావాలి.. ఫైనల్లో కూడా’: వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. పిచ్చిగా వాగితే..