రోహిత్‌ నేడు జట్టుతో... | Rohit Sharma Set To Join Team India On Wednesday In Melbourne | Sakshi
Sakshi News home page

రోహిత్‌ నేడు జట్టుతో...

Dec 30 2020 4:11 AM | Updated on Dec 30 2020 4:11 AM

Rohit Sharma Set To Join Team India On Wednesday In Melbourne - Sakshi

రోహిత్‌ క్వారంటైన్‌ బ్యాండ్‌

మెల్‌బోర్న్‌: ఎట్టకేలకు రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాలో ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు. క్వారంటైన్‌ అనంతరం నేడు అతను మెల్‌బోర్న్‌లో భారత జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్‌లో గాయమైన నాటినుంచి పలు మలుపులు, వివాదాలు, డ్రామా, ఫిట్‌నెస్‌ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను కఠిన క్వారంటైన్‌ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. బుధవారం సహచరులతో కలిసిన తర్వాత అతను సాధన ప్రారంభించే అవకాశం ఉంది. తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్‌ తర్వాత రోహిత్‌ శర్మ మానసిక స్థితి, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడేంచే విషయం నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్‌ అగర్వాల్‌ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్‌ మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement