వరల్డ్‌కప్‌ కోసం వచ్చి.. బాబర్‌ ఆజం పెళ్లి షాపింగ్‌! రూ.7 లక్షలు పెట్టిమరీ | Babar Azam splurges Rs 7 lakh on Sabyasachi designer Sherwani: Reports - Sakshi
Sakshi News home page

World Cup 2023: వరల్డ్‌కప్‌ కోసం వచ్చి.. బాబర్‌ ఆజం పెళ్లి షాపింగ్‌! రూ.7 లక్షలు పెట్టిమరీ

Published Fri, Nov 3 2023 9:04 PM

Reports: Babar Azam splurges Rs 7 lakh on Sabyasachi designer Sherwani - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ ఏడాది చివరలో బాబర్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత్‌లో ఉన్న బాబర్‌.. తన పెళ్లి కోసం తెగ షాపింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు తన పెళ్లి కోసం ఓ ఖరీదైన షేర్వాణీ కొన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణీని బాబర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అతడు ఈ  షేర్వాణీ కోసం ఏకంగా రూ.7 లక్షలు వెచ్చించినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బాబర్‌ తన కోసం విలువైన జువెలరీని కూడా కొనుగోలు చేసినట్లు వినికిడి.

అయితే వరల్డ్ కప్ సెమీస్‌ రేసు రసవత్తరంగా ఉన్న సమయంలో బాబర్‌ పెళ్లి షాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్‌ మీద కాదు ఆటమీద దృష్టి అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.

తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే డూ ఆర్‌ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పాకిస్తాన్‌ ప్రస్తుతం 6 పాయింట్లతో పాయింట్ల పట్టిలో ఆరో స్ధానంలో ఉంది.

సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ బాబర్‌ సేన విజయం సాధించాలి. ఈ క్రమంలో నవంబర్‌4న బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ అమీతుమీ తెల్చుకోనుంది. ఆ తర్వాత నవంబర్‌ 11న కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది.
చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికాతో రసవత్తరపోరు.. ​కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement