ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌.. ఇంటికి పంజాబ్‌, కేకేఆర్‌ | Rajasthan Royals Beat MI By 30 Runs To Enter Playoffs, PBKS, KKR Eliminated | Sakshi
Sakshi News home page

IPL 2026: ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌.. ఇంటికి పంజాబ్‌, కేకేఆర్‌

May 24 2026 8:05 PM | Updated on May 24 2026 8:05 PM

Rajasthan Royals Beat MI By 30 Runs To Enter Playoffs, PBKS, KKR Eliminated

ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది . ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్‌(16 పాయింట్లు).. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(38), జోఫ్రా ఆర్చర్‌(32) జడేజా(19), శనక(29) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్‌ జాక్స్‌, ఘజన్‌ఫర్‌,బాష్‌ తలా వికెట్‌ సాధించారు.

నిప్పులు చెరిగిన ఆర్చర్‌
అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్‌(60), హార్దిక్ పాండ్యా(34) క్రీజులో ఉన్నప్పుడు గెలిచేలా కన్పించిన ముంబై .. వారిద్దరూ వరుస క్రమంలో అవుట్ కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 

ఇక రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. మూడు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. అతడితో పాటు బర్గర్‌, యశ్‌రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.  మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement