FIFA WC 2022: అదృశ్యం కానున్న 'స్టేడియం 974'; ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లను ఎనిమిది స్టేడియాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎనిమిది స్డేడియాల్లో ఒక స్టేడియాన్ని మాత్రం వినూత్న శైలిలో నిర్మించారు. అదే 974 స్టేడియం. అంకెలు ఎందుకు ఉన్నాయనేగా మీ డౌటు.. ఈ స్టేడియం నిర్మాణంలో 974 షిప్పింగ్ కంటైనర్లను ఉపయోగించారు. అందుకే ఈ స్డేడియానికి 974 అని పేరు వచ్చింది. కాగా ఇదే '974' సంఖ్య ఖతార్ అంతర్జాతీయ టెలిఫోన్ కోడ్‌ను సూచిస్తుంది.
అయితే ఫిఫా వరల్డ్‌కప్ ముగియగానే 974 స్టేడియం కనుమరుగు కానుంది. సోమవారం బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య మ్యాచ్ 974 స్టేడియంలో చివరిది కావడం విశేషం. దోహా పోర్ట్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూలగొట్టనున్నట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. తాజాగా స్టేడియానికి సంబంధించిన వీడియోను ఫిఫా వరల్డ్ కప్ అభిమానులతో పంచుకుంది. ''త్వరలో అదృశ్యం కానున్న 974 స్టేడియాన్ని ఒకసారి చూసేయండి'' అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Built with 974 shipping containers. the stadium can be fully dismantled and re-purposed post-event 🧱
Take a look at Stadium 974 🏟️ #FIFAWorldCup #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022
చదవండి: పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!