
న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లో వారం రోజులపాటు నిర్వహించిన శిబిరం తర్వాత భారత జట్లను ఎంపిక చేశారు. కొత్తగా ఏర్పడ్డ వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో సెపె్టంబర్ 4 నుంచి 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. పురుషుల, మహిళల విభాగాల్లో 10 వెయిట్ కేటగిరీల్లో బౌట్‌లు ఉంటాయి.
భారత మహిళల బాక్సింగ్ జట్టు: మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), సాక్షి (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు, సంజూ ఖత్రి (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (65 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు).
భారత పురుషుల బాక్సింగ్ జట్టు: జాదుమణి సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్‌వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ జూనియర్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు), సుమిత్ కుందు (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ అహ్లావత్ (85 కేజీలు), హర్ష్ చౌధరీ (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు).