కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి'

Netizen Request Sourav Ganguly To Change IPL Timing For Serial - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క‌రోనా కార‌ణంగా నిరాశ‌లో కూరుకున్న‌ క్రికెట్ అభిమానుల‌కు వినోదాన్ని పంచేందుకు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) సీజ‌న్ 13 సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో 15 రోజుల్లో యూఏఈ వేదిక‌గా ఈ వేడుక‌ మొద‌లు కానుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. (సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ!)

ఈ క్ర‌మంలో ఐపీఎల్‌ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మా ను ట్యాగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో కోరారు. శివ చరణ్ అనే ట్విట‌ర్ యూజ‌ర్ రాత్రి 7.30 గంట‌ల‌కు స్టార్ మాలో కార్తీక దీపం సీరియ‌ల్ వ‌స్తుంద‌ని ఆ స‌మ‌యంలో ఇంట్లో గొడ‌వ‌లు కాకుండా చూడాల‌ని కోరాడు. ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. ఎందుకంటే 7.30 స‌మ‌యానికి  మా ఇంట్లో ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తారు. అస‌లే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి సార్.'  అని పేర్కొన్నాడు. ఇక శివ చ‌ర‌ణ్‌చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్ క్రియెట్ చేస్తున్నారు. (వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి)

కాగా ఈ ట్వీట్‌పై స్టార్ మా స్పందించడం విశేషం. ‘ఇది చాలా నిజాయితీతో కూడి అభ్య‌ర్థ‌న' ‌అంటూ స‌ద‌రు వ్య‌క్తికి బదులిచ్చింది. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ కార్య‌క్ర‌మానికే కార్తీక దీపం అడ్డు వ‌స్తుందంటే ఆ సీరియల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. టెలివిజ‌న్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతూ.. ప్రజల ఆదరణను విశేషంగా ఆకట్టుకుంది. సీరియల్ చూడని వారికి కూడా అందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు తెలిసేలా ప్రాచూర్యం పొందింది. మ‌రి నెటిజ‌న్ల అభ్య‌ర్థ‌న మేరకు ఐపీఎల్ టైమింగ్ మార్చుతారో లేదా అదే స‌మయానికి ఉంటుందో వేచి చూడాలి. (భ‌జ్జీ.. ఎల్లో టీష‌ర్ట్ మిస్స‌వుతున్నాం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top