సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజేన్ కాప్ (Marizanne Kapp) చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) రికార్డును బద్దలు కొట్టింది. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) తొలి సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లోనూ (42) రాణించిన కాప్.. బౌలింగ్‌లో చెలరేగిపోయింది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్లు తీసి, ప్రత్యర్ది పతనాన్ని శాశించింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..
మారిజేన్ కాప్-44
ఝులన్ గోస్వామి-43
లిన్ ఫుల్‌స్టన్-39
మెగాన్ షట్-39
క్యారోల్ హాడ్జస్-37
మ్యాచ్ విషయానికొస్తే.. గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఇవాళ (అక్టోబర్ 30) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!


