లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ! | LSG Might Bid For-Vaibhav Sooryavanshi Huge Amount-In-IPL 2027 | Sakshi
Sakshi News home page

లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!

May 20 2026 4:13 PM | Updated on May 20 2026 7:01 PM

LSG Might Bid For-Vaibhav Sooryavanshi Huge Amount-In-IPL 2027

Photo Courtesy: IPL 2026

రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌లో చేర‌నున్నాడ‌న్న వార్త‌ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంత‌రం వైభ‌వ్‌తో ల‌క్నో యజ‌మాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చ‌ర్చించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. 

ఆ ఫొటోలను సంజీవ్‌ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్‌’లో పంచుకోవడం విశేషం. మాట‌ల సంద‌ర్భంలో ల‌క్నో జ‌ట్టులో చేరాలంటూ వైభ‌వ్‌కు సంజీవ్ గోయెంకా అడిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే క‌ళ్లు చెదిరే మొత్తాన్ని వైభ‌వ్‌కు ఆఫ‌ర్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అనేది ప‌క్క‌న‌బెడితే.. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభ‌వ్‌, ఆ త‌ర్వాత ఆయ‌న‌తో చాలాసేపు ముచ్చ‌టించాడు. ల‌క్నో జ‌ట్టులోకి వ‌స్తాడా? రాడా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే, వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట‌కు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అత‌డి టెక్నిక్‌, బ్యాటింగ్ ర‌హ‌స్యం గురించి చ‌ర్చించి ఉండొచ్చ‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ స‌మయంలోనే ల‌క్నో జ‌ట్టులో చేరాలంటూ వైభ‌వ్‌కు ఆయ‌న భారీ ఆఫ‌ర్ కూడా ఇచ్చి ఉంటార‌ని అనుకుంటున్నారు. 

నిజానికి వైభ‌వ్ సూర్య‌వంశీకి వ‌చ్చే ఏడాది యాక్ష‌న్ పూల్‌లో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వైభ‌వ్ సూర్య‌వంశీని త‌క్కువ ధ‌ర‌కే సొంతం చేసుకున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అత‌డిని విడుద‌ల చేసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అవ‌స‌ర‌మైతే ఎక్కువ అమౌంట్‌ను కోట్ చేసి వైభ‌వ్‌ను త‌మ జ‌ట్టుతోనే అట్టిపెట్టుకునే అవ‌కాశముంది. 

ఐపీఎల్ మెగావేలానికి మ‌రో రెండేళ్లు ఉండ‌డంతో అప్ప‌టివ‌ర‌కు వైభ‌వ్ సూర్య‌వంశీని త‌మ‌తోనే ఉంచుకోవాల‌ని రాజ‌స్తాన్ భావిస్తోంది. ఒక‌వేళ వైభ‌వ్ సూర్య‌వంశీ త‌నంత‌ట తానుగా రాజ‌స్తాన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాల‌నుకుంటే మాత్రం అత‌న్ని ద‌క్కించుకోవ‌డానికి  ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. 

ప‌ట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ఇవాళ ఐపీఎల్‌లో అన్ని ఫ్రాంచైజీల‌కు హాట్ కేక్‌లా మారిపోయాడు. అత‌డు వ‌స్తానంటే ఎంత భారీ ధ‌ర‌కైనా కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. 13 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 579 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. 

మంగ‌ళ‌వారం ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో 221 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో వైభ‌వ్ సూర్య‌వంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు విజ‌యాన్ని బాట‌లు వేశాడు. ఈ సీజ‌న్ ఆరంభంలో వ‌రుస విజ‌యాలు సాధించిన రాజ‌స్తాన్ ఆ త‌ర్వాత ఓట‌ముల‌తో ఢీలా ప‌డింది. 

కానీ చివ‌రి అంకంలో మ‌ళ్లీ ఫుంజుకున్న రాయ‌ల్స్ విజ‌యాలు సాధించి 14 పాయింట్లతో ప‌ట్టిక‌లో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రగ‌నున్న త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాల‌ని రాజ‌స్తాన్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక టీమిండియా సీనియ‌ర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభ‌వ్‌కు ఇంకా స‌మ‌య‌ముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జ‌ట్టుకు మాత్రం అత‌డిని ఎంపిక చేసింది. మ‌రి ఇండియా-ఏ త‌ర‌ఫున మ్యాచ్‌ల్లో వైభ‌వ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలి.

చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement